Wednesday, October 7, 2009

హాస్యవల్లరి - 2

1. " మా ఆయన ఈ మధ్య బాగా మారిపోయారు తెలుసా ?" ఏడుస్తూ అంది రాధ.

" ఏమయ్యిందో చెప్పవే,నాకు తోచిన సలహా ఇస్తాను" అనునయం గా అంది అనురాధ.

" పెళ్ళి కాకముందు ప్రేమిస్తున్నానంటూ వెంటబడే రోజులలో నువ్వు లేకుండా బ్రతకలేనంటూ హుషారుగా పాత సినిమాలలో శోభన్ బాబులా సినిమా డైలాగులు చెప్పేవారు. ఈ మధ్య జీవితమే నరకం, జీవితం మూణ్ణాళ్ళ ముచ్చటే అంటూ మజ్ఞూ లా విషాదం గా పాటలు పాడుతున్నారు" ముక్కు చీదుతూ అసలు సంగతి చెప్పింది రాధ.

2. " ఏమిటండీ ఈ రోజు ఇంత త్వరగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసారు ?" మూడు గంటలకే ఇంటికి చేరుకున్న భర్త గణేశ్ ను అడిగింది భార్య కమల.

" ఫైలు తీసుకెళ్ళి ఆఫీసరు గారి ముందు పెడితే కోపం గా నాలుగు తిట్లు తిట్టీ గో టు హెల్ అన్నాడు. వెంటనే ఇంటికి అదే నా హెల్ కు వచ్చేసాను" అసలు సంగతి చెప్పాడు గణేశ్.

3. " నేనెంత కన్విన్స్ చేస్తున్నా మా పేరెంట్స్ మన పెళ్ళికి ఒప్పుకోవదం లేదు !" పెదవి విరుస్తూ అంది రేఖ.

" మరైతే ఏం చేద్దాం ? లేచి పోయి పెళ్ళి చేసుకుందామా ?" అడిగడు శేఖర్.

"అటువంటి నీచపు పనులు మా ఇంటా వంటా లేవు.ఇంక మనము బ్రతికి వేస్ట్ అనిపిస్తోంది నాకు"

" ఏం చేద్దాం"

" నువ్వు ఏ రైలు కిందో తల పెట్టేయి."

" నాకైతే ఒ కె, మరి నువ్వో?"

" నువ్వు లేని జీవితాన్ని ఊహించుకుంటూ,మన గతపు అనుభవాలను నెమరు వేసుకూంటూ ఏ గొట్టం గాడినో పెళ్ళి చేసుకొని బ్రతికేస్తాను " తాపీగా చెప్పింది రేఖ.

4. " నీ కోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధం గా వున్నాను. ఏం చెయ్యమంటావో చెప్పు. సింగిల్ హాండ్ తో కళ్ళకు గంతలు కట్టుకొని బైక్ ను నడపమంటావా ?లేక నిన్ను ఎత్తుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కమంటావా ?" ఆవేశం గా అడిగాడు మన్మధరావు.

" అవేం వద్దులే గాని, నేను రేపు ఫస్ట్ షో కి ఐమాక్స్ లో సుశాంత్ తో సినిమాకు వెళదామనుకుంటున్నాను. మా ఇద్దరికీ రెండు టికెట్లు తెచ్చి ఇవ్వు చాలు " అసలు సంగతి చెపింది భార్గవి.

5." నువ్వు ఇంకా రెండు రోజుల కంటే బ్రతకవు. నీ ఆఖరి రొజులలో ఎవరినైనా కలవాలనుకుంటున్నావా ? " అడిగాడు డాక్టర్ దైవాధీనం

" అవును. ఒక మంచి డాక్టర్ ను కలవాలనుకుంటున్నాను" అసలు సంగతి తాపీగా చెప్పాడు పరమేశం.

6. " ఒక సీరియల్ లో మీరు అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ పాత్రలు వేస్తున్నారట కదా ! బహుశా తెలుగు టి వి పై త్రిపాత్రాభినయం ఇదే మొదటి సారి అనుకుంటున్నాను.కంగ్రాచులేషన్స్. ఒకే సీరియల్ లో మీరు ఒకేసారి మూడు పాత్రలు ఎలా వేయగలుగుతున్నారు ?" ఆసక్తిగా అడిగాడు సినిమా పత్రికా విలేఖరి.

" ఏముందీ, వెరీ సింపుల్. ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్స్ పూర్తయ్యేసరికి అమ్మను అయిపోతాను. మరి వెయ్యి ఎపిసోడ్స్ కు ఏజ్ బార్ అయ్యి నాచురల్ గా అమ్మమ్మ పాత్రను పోషించేస్తాను" అసలు సంగతి చెప్పింది వర్ధమాన నటి శిరీష..

No comments: