Sunday, June 8, 2008

కవితలు - 2

మండుతున్న ధరలు

కూరగాయల ధరలకు సామాన్యుల బెంబేలు
రోజు రోజుకూ రాకెట్ల కంటే వేగం గా
ఆకాశ పధాన దూసుకుపోతున్న ధరలు
పెట్రో మంటలు పోస్తున్నాయి అగ్నికి ఆజ్యం
సంచీ నిండా డబ్బుతో జేబులో కూరగాయలు
కొనుక్కుంటున్న దుర్భర పరిస్థితి
వ్యవసాయ భూములు బడా సంస్థలకు ధారా ధత్తం
ఏటేటా తరిగిపోతున్న వ్యవసాయ ఉత్పత్తులు
రైతు బజారులు అవుతున్నాయి నిర్వీర్యం
అతి వృష్టి, అనావృష్టి లతో రైతన్నలకు తోచదు దిక్కు
ఎంత కష్టించినా రైతులకు అందని ఫలం
దళారులు అవుతున్నారు కుబేరులు
చాలీ చాలని జీతాలతో అధిక ధరలతో
సగటు పౌరుల బ్రతుకు నానాటికీ అధ్వాన్నం
పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న రెస్టారెంట్లకు
తరలిపోతున్నాయి మనకు చెందాల్సిన కూరగాయలు
ఉన్న వాడికి ధరలెంత పెరిగినా పట్టదు
లేని వాడికి ధరలతో నిమిత్తం లేదు
మధ్య వాడికే రగులుతోంది కడుపులో మంట
ఎన్నటికీ చల్లారేను ధరల మంత
ఏలికలకు కను విప్పు ఎన్నడు ?

పాఠశాల

అందమైన దేవాలయం బడి
జీవితం లో ఎదిగేందుకు మహోన్నతమైన
వ్యక్తిత్వం సాధించేందుకు
భౌతికమైన కోర్కెలను తీర్చుకునేందుకు
వల్సిన అర్హతలను అందించునది బడి
బడి ప్రభావం మనపై ఇంతింత కాదయా !
అ, ఆ లు దిద్దించే స్థితి నుండి
పి హెచ్ డి వంటి ఉన్నతమైన డిగ్రీ లను
అందించు పరమ పవిత్ర దైవ సన్నిధానం బడి
మానవ జీవితాన్ని తీర్చి దిద్దే బడిని
అపవిత్ర మొనర్చుట క్షమించ రాని నేరం
ప్రేమ కలాపాలు, అత్యా చారాలు,దౌర్జ్యనాలు,
లైంగిక వేధింపులు మితి మీరి పోవుట శోచనీయం
చదువుల తల్లి సరస్వతికి వ్యధ కల్గించుట బాధాకరం
మానవులను మహనీయులుగా తీర్చి
జీవితం లో మహోన్నతమైన శిఖరాలను అధిరోహింపజేసే
బడి ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది
బడియే మనకందరకు గుడి

No comments: