Sunday, February 3, 2008

తల్లిదండ్రులు

కనిపించని దైవానికి ప్రతిరూపాలు మన తల్లిదండ్రులు
తాను సృష్టించిన బిడ్డలకు అండ దండలుగా నిలబడి
వారి సంక్షేమం ,ప్రగతి కోసం
తానే తల్లిదండ్రులుగా ఆ పరమత్మ
అవతరించిన వైనం అపూర్వం అద్వితీయం
జీవితమంతా ఎనలేని త్యాగాలను ఒనరించి
రక్తాన్ని స్వేదంగా మార్చి ఎంతో కష్టించి
తమ స్వార్జితమంతా బిడ్డల కోసమే వెచ్చించి
ఆ తల్లిదండ్రుల త్యాగ నిరతి వర్ణింపదగనిది
వారి రక్త మాంసములను పంచుకు పుట్టి
వారి శక్తినంతా త్రాగేసి పెద్దవారలమైన మనం
వారిని నిర్లక్ష్యం చేయడం
వారిని అవసాన దశలలో అనాధలుగా వదిలివేసి
మన స్వార్ధం చూసుకోవడం క్షమించరాని నేరం
తల్లి దండ్రుల నిరాదరణ భగవంతుని నిరాదరణతో సమానం
రౌద్రవాది నరక ప్రాప్తి తప్పదు
మనం జీవించే ఈ ప్రపంచం సుఖంగా వర్ధిల్లాలంటే
వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల
మన బాధ్యత నెరిగి ప్రవర్తించడం అత్యావశ్యకం

No comments: