Monday, April 7, 2008

సర్వే జనా సుఖినోభవంతు

మానవ జీవితం బహు అమూల్యం
ఎన్నో వేల హీన జన్మలననంతరం మాత్రమే లభించునది
కోట్ల ప్రాణులలో కొన్నింటికీ మాత్రమే దక్కునది
కుసంస్కారాలతో,ధనాశతో,అహంకారం తో
అరిషడ్వర్గాలకు లోబడి హింసాయుత ప్రవృత్తితో
విషయానందాలకు బానిసలమై
మానవతా విలువలను త్రుంగలోకి తొక్కి
సంభంధ భాంధవ్యాలను మరిచిపోయి
పశువుల కంటే జీవించడం శోచనీయం
దీనికి ప్రతిఫలం భవిష్యత్తులో లభించు హీన జన్మలు
సద్గుణాలను అలవర్చుకొని, భక్తి భావం పెంపొందించుకొని
ఉన్నతమైన ఆశయాల సాధనకు ఉపక్రమించి
మనం ఆనందం గా బ్రతుకుతూ
ఇతరులను బ్రతికిస్తూ
మన ఆనందాలను, ఐశ్వర్యాలను వీలైనంతగా
మన తోటి సమాజస్థులకు పంచి ఇస్తూ
సర్వే జనా సుఖినోభవంతు అను రీతిన
బ్రతుకు - బ్రతికించు అన్న సిధాంతాన్ని
త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ, ఆత్మ విశ్వాసం తో
ఆత్మ స్థైర్యం తో , పరిశుద్ధమైన మనసుతో
ముందడుగు వేసిన వారి జీవితం ధన్యం

జీవన విధానం

డబ్బు చుట్టూనే పరిభ్రమిస్తున్న ప్రపంచం
ధనార్జనే ధ్యేయం గా, పరమావధిగా
పశువుల కంటే హీనంగా కష్టిస్తున్న మానవుడు
తద్వారా సంపాదించిన ధనాన్ని అనుభవించేందుకు
సమయం,ఓపిక,ఆరోగ్యం అసలే లేవు
కూడబెట్టిన అస్థులన్నీ దాయాదుల వశం
ఆకలితో అలమటించే అన్నార్తులకు నయాపైసా
దానం చెయ్యలేని గొప్ప దయా హృదయం మనది
డబ్బు, కీర్తి, పదవి కాంక్షలు తలెకెక్కిన మత్తులో
నా అన్నవారినందరినీ దూరం చేసుకొని
ఈ సమాజం లో ఒంటరి జీవనం సాగిస్తున్న మానవుడు
ఖాళీ చేతులతో వచ్చి, తన స్వంతం అనుకున్న వాటిని
విడిచి పెట్టి ఖాళీ చేతులతోనే ఈ ప్రపంచాన్ని
విడిచివెళ్ళాలని తెలియనిది ఎవరికి ?
అయినా వీసమెత్తు దానగుణం ప్రదర్శించలేని
గొప్పవారము మనమందరం
తమ కంటూ వున్న దానిని సమానం గా పంచుకు తింటూ
ఆనందం గా, ఏ చీకూ చింతలు లేక ఆనందమయ
జీవనం సాగించే పశు పక్ష్యాదుల జీవన విధానమే ఎంతో శ్రేష్టం

Sunday, April 6, 2008

అందమైన జీవితం

అరోగ్యకరమైన ఆలోచనా ధోరణి
జీవితం లో విజయం సాధించుటకు
ఆనందమయమైన జీవనం సాగించుటకు అత్యావశ్యకం
అనారోగ్యకర ఆలోచనా విధానం ప్రగతికి చేటు
అశేష శారీరక , మానసిక వ్యాధులకు పుట్టినిల్లు
మానవ జీవితమంతా అశాంతి మయం
నిత్యం చింతలు, సమస్యలు, ఆందోళనలు
హృదయం ఒక మండుతున్న లావా
కటువైన ప్రవర్తనతో మానవ సంభందాలన్నీ దూరం
కృషి, పట్టుదల, తపనలతో పాటు
సానుకూల ఆలోచనా ధృక్పధం తో
నిత్యం ప్రశాంతం గా అరోగ్యకరం గా వుండే మనసుతో
ముందడుగు వేసిన నాడు
అనితర సాధ్యమైన విజయాలన్నీ మనకు స్వంతం
జీవితం ఒక విరబూసిన నందనవనం

విజయ రహస్యం

కాలం, ఖర్మం కలిసి రాలేదంటూ
జాతక చక్రం అనుకూలంగా లేదంటూ
జీవితం లో ప్రగతి సాధించలేకపోవుటకు
నెపాన్ని ఇతరులపై నెట్టేసి
నిమ్మకు నీరెత్తనట్లు హాయిగా
కూర్చునే వారు అధమాధములు
విజయం సాధించుటకు
తగిన మూల రహస్యం,సూత్రం
తమలోనే వున్నదని గ్రహించి
పట్టుదల, దీక్ష తపనలతో
క్రమబద్ధమైన ప్రణాళికతో
ధైర్యే సాహసే లక్ష్మీ అంటూ
ముందుకు సాగిన వారు ఉత్తములు
అనితర సాధ్యమైన విజయాలు వారికే స్వంతం

Sunday, February 24, 2008

నేను చదివిన ఒక మంచి కధ - నాన్నా ! క్షమించండి

27-02-08 తేదీ గల నవ్య వార పత్రిక (కాజల్ ముఖ చిత్రం) లో నాన్నా ! క్షమించండి అన్న పేరుతో వచ్చిన ఒక కధను చదివాను. ఈ కధకు రచయిత ఎం, వెంకటేశ్వర రావు. మానవతా విలువలు, అభ్యుదయ భావాలు అంతరించిపోతున్న ప్రస్తుత తరుణం లో ఈ విలువలను కాపాడెందుకు ఒక యువకుడు చేసిన ప్రయత్నాన్ని ఈ కధలో అత్యద్భుతం గా ఆవిష్కరించారు. నాన్నా క్షమించండి అంటూ ఒక కొడుకు తన కన్న తండ్రికి రాసే ఉత్తరం తో ఈ కధ ప్రారంభమౌతుంది.అన్నయ్య, అక్కయ్య లు మంచి చదువులు చదివి జీవితం లో సెటిలై పోయారు. తమ్ముడి కి మాత్రం చదువు చక్క గా అబ్బలేదు.అత్తెసర మార్కులతో డిగ్రీ పాసవుతాడు. సహజం గానే పెద్ద వాళ్ళు చక్కని విద్యావంతులు అవడం వలన చిన్న వాడం టే చులకన భావం తమ్ముళ్లకు ఏర్పడుతుంది.

చిన్నవాడు బ్యాంకు పరీక్షలకు ప్రిపేరవుతుందగా తండి కొలీగ్ వచ్చి బ్యాంకు పేపరు ను అందించి ఈ మోడల్ పేపరు ప్రకారం ప్రిపేరవమని చెబుతాడు. ఆశ్చర్యం గా అదే పేపరు పరీక్షలో వస్తుంది. సరిగ్గా అక్కడే మన కధా నాయకుడిలో అంతర్మధనం ప్రారంభమౌతుంది. లీకయిన పేపరును చూడగానే అతనికి అసంతృప్తి, ఆత్మవంచనగా అనిపిస్తుంది.కష్టపడి చదివి అక్కడికి వచ్చిన తన తోటి వారిని మోసం చేయకూదదని నిర్ణయించుకుంటాడు. అప్పుదే విద్యార్ధి సంఘాల వారు వచ్చి పరీక్షను రద్దు చేయిస్తారు.జరిగిన విషయాన్ని చెబుదామని తనకు సహాయం చెసిన అంకుల్ ఇంటికి వెళ్లగా అక్కడ తన తండ్రే ఎంతో డబ్బు వెచ్చించి పరీక్షా పేపరును తన కోసం కొన్నాడని తెలుస్తుంది. జీవిత మంతా అంకిత భావం తో, క్రమ శిక్షణతో పని చెసిన తన తండి తన కోసం మొదటిసారిగా తప్పుడు పని చేసాడని తెలుసుకున్న మన కధా నాయకుడు తన తండి నుండి నేర్చుకున్న క్రమ శిక్షణ , నిజాయతీలను పెట్టుబడిగా ఒక చిన్న పరిశ్రమను స్థాపించాలన్న నిర్ణయం తీసుకొని, అదే విషయాన్ని తన తండ్రికి తెలియజెస్తాడు. ఈ ప్రయత్నం తప్పనిపిస్తే క్షమించమంటు తన ఉత్తరాన్ని ముగిస్తాడు.

రచయిత ఒక విభ్భిన్నమైన కధ వస్తువును ఎన్నుకొని, దానికి ఒక చక్కని రూపం ఇవ్వడం లో 100 శాతం మర్కులు కొట్టేసారు. స్వార్ధమే ఊపిరిగా బ్రతికే మన నవతరం యువకులకు ఈ కధ ఒక కనువిప్పు కాగలదు.రచయిత యొక్క శైలి, భావ ప్రకటన చలా బావున్నాయి. సాహిత్య అభిమానులందరూ తప్పక చదవవలసిన కధ ఇది.

Saturday, February 23, 2008

ఆశావహ దృక్పధం

జీవన గమనం లో విజయం సాధించుటకు
ఆశావహ దృక్పధం అత్యావశ్యకం
వర్తమానం లో జీవిస్తూ విజయం సాధించగలనన్న
నమ్మకం కలిగి వుండడం విజయానికి ఒక ముఖ్య సూత్రం
గతం లోని వైఫల్యాలను గురించి చింతిస్తూ
భవిష్యత్తు గురించి ఆందొళన చెందుతూ
వర్తమానం లో అమూల్యమైన సమయాన్ని
వృధా చేసుకోవదం అవివేకుల లక్షణం
తనపై తనకు నమ్మకాన్ని పెంచుకుంటూ
ధైర్యాన్ని , ఆత్మ విశ్వాసాలను కూడ గట్టుకుంటూ
స్పష్టమైన లక్ష్యాలతో, ప్రణాళికలతో
ముందుకు సాగిన నాడు అన్నింటా విజయం తధ్యం

రైతన్నలు

దేశానికి వెన్నుముక్క మన రైతన్న
దేశాభివృద్ధిలో రైతన్నకు ఎంతో ప్రాధాన్యం
పల్లెలు ప్రగతి పధామున నడిచేందుకు
రైతన్నల పాత్ర బహు కీలకం
వ్యవసాయ ఆధారిత దేశం లో
తరచు నిర్లక్ష్యానికి గురయ్యె మన రైతన్న
వాతావరణ ప్రతికూలతలు, విద్యుత్ కోతలు
నకిలీ విత్తనాల పంపిణీ, దళారుల అజమాయిషీ
వ్యవసాయ రంగం లో తగ్గిన ప్రభుత్వ పెట్టుబడులు
సకాలం లో అందుబాటుకు రాని పంటలు
రైతన్నలకు లభించని గిట్టుబాటు ధరలు
రైతన్న ల కడగండ్లను పట్టించుకోని ప్రభుత్వాలు
నలుగురికీ అన్నం పెట్టిన అన్నపూర్ణ చెయ్యి
ఇప్పుడు పది మంది ముందు జాపవల్సిన దుస్థితి
రైతన్న ఆనందం గా వుంటేనే పల్లెలు సుభిక్షమౌతాయి
తద్వారా సుస్థిర దేశాభివృద్ధి సాధ్యం

Sunday, February 3, 2008

డబ్బు డబ్బు డబ్బు

జన్మ సాఫల్యం

అన్ని జన్మలలో కంటే ఉత్కృష్టమైన ,
అతి దుర్లభమైన మానవ జన్మను పొంది
నమో విశ్వరూపాయ నమ: అను రీతిన
ఆ పరమాత్మను గుర్తెరిగి
ఉపాసించలేని జీవితం వ్యర్ధం
నామ, రూప, గుణ రహితమైన
ఆ పరబ్రహ్మమును దర్శించడమే
మన జీవిత లక్ష్యం ,గమ్యం పరమావధి కావాలి.
హృదయమును వివేకపూరితంగా ,
ఆత్మను మలిన రహితంగా చెసుకొని
కఠినమైన తపస్సుతో , సాధనతో
అరిషడ్వర్గములను లోబర్చుకొని ,
దుష్ట సంస్కారములను రూపు మాపుకొని
పరమాత్మను దర్శించి జన్మ సాఫల్యం పొందడమే మన కర్తవ్యం

తల్లిదండ్రులు

కనిపించని దైవానికి ప్రతిరూపాలు మన తల్లిదండ్రులు
తాను సృష్టించిన బిడ్డలకు అండ దండలుగా నిలబడి
వారి సంక్షేమం ,ప్రగతి కోసం
తానే తల్లిదండ్రులుగా ఆ పరమత్మ
అవతరించిన వైనం అపూర్వం అద్వితీయం
జీవితమంతా ఎనలేని త్యాగాలను ఒనరించి
రక్తాన్ని స్వేదంగా మార్చి ఎంతో కష్టించి
తమ స్వార్జితమంతా బిడ్డల కోసమే వెచ్చించి
ఆ తల్లిదండ్రుల త్యాగ నిరతి వర్ణింపదగనిది
వారి రక్త మాంసములను పంచుకు పుట్టి
వారి శక్తినంతా త్రాగేసి పెద్దవారలమైన మనం
వారిని నిర్లక్ష్యం చేయడం
వారిని అవసాన దశలలో అనాధలుగా వదిలివేసి
మన స్వార్ధం చూసుకోవడం క్షమించరాని నేరం
తల్లి దండ్రుల నిరాదరణ భగవంతుని నిరాదరణతో సమానం
రౌద్రవాది నరక ప్రాప్తి తప్పదు
మనం జీవించే ఈ ప్రపంచం సుఖంగా వర్ధిల్లాలంటే
వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల
మన బాధ్యత నెరిగి ప్రవర్తించడం అత్యావశ్యకం

బద్ధ శత్రువులు

బద్ధకం, ఆలసత్వం అనునవి
మానవునికి బద్ధ శత్రువులు
ఆంతర్గతంగా మనస్సులోనే కొలువుండి
మానవులను అధమ పాతాళానికి తొక్కివేయును
మందభావం వలన కార్యశూన్యత సంభవం
తక్కువ శ్రమతో ఎక్కువ సాధించవలెనన్న
ఆలోచన శ్రమించే గుణం నుండి తప్పించును
తద్వారా కలుగు మందకొడితనం వలన
అడ్దదారులు తొక్కే ప్రయత్నం
ఎంతో సాధించవలెనన్న ఆలోచనలు
చివరకు ఏమీ సాధించలేదన్న నైరాశ్యం
మానవుల హృదయం కల్లోల భరితం చేయును
తీవ్రమైన సాధన వలన ఈ దుర్గుణములను
దూరం చేసుకొని, చలాకీగా
ఆనందోద్వేగాలతో ముందడుగు వేయు
కార్యశీలురకు అన్నింటా విజయం తధ్యం

సమ సమాజ స్థాపన

కులాల వారీగా మాతాల వారీగా
మన సమాజాన్ని విచ్చినం చేస్తున్న
అఖంఢ భారతా మాత కంట తడి
విద్రోహకర, వినాశకర శక్తులు
సర్వ మత, సర్వ మానవ ఏకత్వ భావనలు
నానాటికీ మన మధ్య నుండి మటుమాయం
అందరిలో ప్రవహించే రక్తమొక్కటే
అందరిలో నిగూడమై, నిక్షిప్తమై వున్న
అంతర్గత ప్రాణ శక్తి ఒక్కటే
ధర్మ సంస్థాపన కోసం వివిధ కాలముల యందు
ఈ భువిపై అవతరించిన మహనీయుల
బోధలే మనకు వివిధ మతాలు
అందరి ప్రవచన సారాంశం ఒక్కటే
అదియే సర్వ మత, సర్వ మానవ సమానత్వం
అందరం ఒక్కటే, అంతా ఒక్కటే
తమ స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం
మనందరి మధ్య చిచ్చు పెట్టి తద్వారా
తమ పబ్బం గడుపుకోజూస్తున్నదుష్ట శక్తులను తిప్పి కొట్టండి
కుల మత రహిత సమ సమాజ స్థాపన కొరకు
అందరం నడుం బిగిద్దాం

దైవ సమానులు

నిస్వార్ధ తత్వంతో పదిమందితీ మంచిగా వుంటూ
వారి శ్రేయస్సే పరమావధిగా భావిస్తూ
త్రికరణ శుద్ధిగా సమాజ సేవ చేయు
మానవులు దైవ సమానులు
మానవ సేవే మాధవసేవ
హృదయశుద్ధి కలిగి
ఎల్లవేళలా సమాజ శాంతి కాంక్షించే
మహనీయులను అనుసరించడం అభిలషణీయం
సమాజ చైతన్యానికి నడుం బిగించి
సర్వాన్ని త్యాగమొనరించి
విశ్వశాంతికి కంకణం కట్టుకున్న
మహానుభావులు దైవానితో సమానం
అట్టి వారు సర్వదా ఆ పరమేశ్వరునికి ప్రీతిపాత్రులు
వారే మనకు మంచి దారి చూపగల సమర్ధులు

పల్లెలలో నాణ్యమైన విధ్య

పట్టణాలు ఆధునిక విద్యలో
రాకెట్ వేగంతో చంద్రమండలం కు
దూసుకు పోతుంటే మన పల్లెలలో మాత్రం
ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందం
ప్రభుత్వం ఎన్ని పధకాలను చేప్పట్టిననూ
ఏ మాత్రం కాన రాని అభివృద్ధి
ఆరకొర వసతులు, అందుబాటులో లేని పుస్తకాలు
శిధిలావస్థలో పాఠశాల భవనాలు
చాలీ చాలని జీతాలతో అన్యమనస్కంగా
పనిచేసే ఉపాధ్యాయ సిబ్బంది
నానాటికీ తగ్గిపోతున్న ఉత్తీర్ణత శాతం
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
పల్లెలలో నాణ్యమైన విధ్య ఒక మిధ్య

కలియుగ దైవం శ్రీసాయినాధులు

ఆద్భుతమైన, అపురూపమైన అసామన్య
గురుదేవులు, కలియుగ దైవం శ్రీసాయినాధులు
పిలిచినంతనే ఓయని పలికి
భక్త జనావళికీ ఆపన్న హస్తం అందించే సద్గురువు
నీటితో దీపాలు వెలిగించి భక్తజన హృదయాలలో
అజ్ఞానపు చీకట్లను దూరం చేసిన జ్ఞానస్వరూపి
దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు
ధర్మ సంస్థాపన కొరకు మనపై కరుణతో
ఈ భువిపై అవతరించి లక్షలాది మందిని
సన్మార్గులను చేసిన అపురూపదైవం మన సాయి
తన పాదాల వద్ద తమ భారములను పడవేసిన
వారిభారమంతటినీ వహించి వారికి
అనుపమలభ్యం కాని శాశ్వత ఆనందమును
ప్రసాదించే ఆశ్రిత కల్పవృక్షం శ్రీ సాయి
సాయి నామమును ఉచ్చరించువారికి
సాయి పాదాలను శరణు వేడిన వారికి
అన్ని సమస్యలు, చింతనలు కడు దూరం